Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…నెరవేరిన రాయలసీమవాసుల చిరకాల కోరిక….!

బ్రేకింగ్..ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం…నెరవేరిన రాయలసీమవాసుల చిరకాల కోరిక….!

ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న వైయస్ జగన్..మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు అనగా ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీసీఎం జగన్ కర్నూలు లో ఏపీ హైకోర్టు ఏర్పాటు పైన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్నూలులో హైకోర్ట్ పెట్టాలని రాయలసీమ వాసులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు. గత ఐదేళ్లలో కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసే విషయాన్ని చంద్రబాబు సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్ కర్నూలులో హెకోర్ట్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో విశాఖలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా జగన్ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి ఈ మేరకు స్పష్టత ఇస్తారని ఏపీ రాజకీయ,అధికార వర్గాల్లో, న్యాయవాదుల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్ర తొలి హైకోర్టు ఏర్పాటు అయిన కర్నూలులోనే ఇప్పుడు తిరిగి హైకోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.

మద్రాసు నుంచి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు తొలి రాజధాని అయింది. కర్నూలులోనే హైకోర్టు కూడా ఏర్పాటు అయింది. అయితే 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలంగాణతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు ద్వారా కర్నూలు హైకోర్టును కోల్పోయింది. హైకోర్టుతో సహా…అన్ని ప్రభుత్వ కార్యలయాలు హైదరాబాద్‌లోనే ఏర్పాటు అయ్యాయి. దీంతో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రకృతం అయింది. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుపడిన సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారం మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించ వద్దంటూ శివరామక్రిష్టన్ కమిటీతో పాటుగా మేధావులు సూచించారు. కానీ చంద్రబాబు మాత్రం నవ్యాంధ్రప్రదేశ్‌‌కు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌ తరహాలోనే అమరావతి ప్రాంతంలోనే అన్ని ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయించారు. అంతే కాదు ఏపీ హైకోర్టును కూడా హడావుడిగా అమరావతిలోనే ఏర్పాటు చేయించారు.

అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావటం తో కర్నూల్లో హైకోర్ట్ ఏర్పాటు చేయాలనే అంశంపై ముందడుగు పడింది. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   ఇదే సమయంలో కోస్తా ప్రజలకు తమ నుండి హైకోర్టు దూరం చేస్తున్నారనే భావన రాకుండా.. విశాఖలో కూడా హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటు ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే అమరావతిని జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తుందని…అందుకే అమరావతి నుంచి ఏపీ హైకోర్టును పూర్తిగా తరలించే బదులు…కర్నూలులోనే హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తే బెటరని…కొందరు జగన్‌కు సలహా ఇస్తున్నట్లు సమాచారం. మొత్తంగా సీఎం జగన్ కర్నూలులో పూర్తి స్థాయిలో హైకోర్టును ఏర్పాటు చేస్తారా లేదా…హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై రేపటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్పష్టత రానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat