ఆయన మాటలు…తూటాలు…ఆయన ప్రసంగాలు…ఓ ఉప్పెన…విశ్వసనీయతకు నిలువుటద్దం…..వైయస్ జగన్‌పై వెలకట్టలేని అభిమానానికి నిలువెత్తురూపం. ఆయన. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా…వైయస్ జగన్‌కు నమ్మిన బంటుగా, అనతికాలంలోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వైసీపీ యువనేత…బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి. నందికొట్కూరు ఇంచార్జిగా వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన సిద్ధార్థ్ రెడ్డిని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అసలు వైసీపీ ఎమ్మెల్యేగా బైరెడ్డి పోటీ చేస్తారు అనుకున్నారు..కానీ కొన్ని సామాజిక సమీకరణాల నేపథ్యంలో బైరెడ్డికి టికెట్ దక్కలేదు. దీంతో ఎన్నికల ప్రచార సమయంలో బైరెడ్డిని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని జగన్ హామీ ఇచ్చారు. తాజాగా జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ముఖ్యమైన కార్పొరేషన్ పదవి అప్పగించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ గా బై రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు జగన్. మొన్నటివరకు నందికొట్కూరు నియోజకవర్గానికి పరిమితమైన బైరెడ్డి కర్నూలు జిల్లా కేంద్రంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు
