అనసూయ…బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే..సినిమాల్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్న యాంకర్ కమ్ యాక్ట్రెస్. ఇటీవల రామ్‌చరణ్ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ… రీసెంట్‌గా కథనం చిత్రంలో హీరోయిన్‌గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా అనసూయ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనుకాడదు. తరచుగా హాట్ హాట్ ఫొటోషూట్లతో అందాలు కురిపిస్తూ…కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా కథనం మూవీ ప్రమోషన్‌లో భాగంగా కమేడియన్ ధన్‌రాజ్‌తో కలిసి…ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ… తన పర్సనల్ లైఫ్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు ముందుగా ఎవరిని కాంటాక్ట్ చేస్తారని ధన్‌రాజ్ అడిగిన ప్రశ్నకు…. ఇంకెవరికి మా ఆయనకే చేస్తా అని వెంటనే సమాధానం చెప్పేసింది అనసూయ. తనకు 16ఏళ్ల వయసు నుంచే తన భర్తతో మంచి అటాచ్‌మెంట్ ఏర్పడిందని, తన లైఫ్ లో ఆయనకు తప్ప ఇంకెవరికి చోటు లేదని పేర్కొంటూ భర్తపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టింది అనసూయ. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న అనసూయ తన ఫ్యామిలీకి మాత్రం బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. గతంలో కూడా పలు సందర్భాల్లో పిల్లలు, భర్త శశాంక్ భరద్వాజపై ఉన్న ప్రేమను చాటుకుంది అనసూయ. తాజాగా తన జీవితంలో తన భర్తకు తప్ప…వేరొకరికి ఛాన్స్ లేదంటూ..మరోసారి అనసూయ తేల్చి చెప్పింది.
