టాలీవుడ్ హిస్టారికల్ చిత్రం బాహుబలి చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ప్రభాస్ మరియు రానా కీలక పాత్రలు పోషించి, సినిమాలో హైలైట్ గా నిలిచారు. ఇందులో తమన్నా, అనుష్కా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి వారిని జక్కన్న వాడుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి గాను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 5 సంవత్సరాలు దీనితోనే ఉండిపోయాడు. అయితే తన ఒప్పందం ప్రకారం ప్రభాస్ ఏడాదికి రెండు కోట్లు తీసుకున్నాడు. అలా ఈ ఐదు సంవత్సరాలకు గాను ప్రభాస్ 12కోట్లు తీసుకున్నాడు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి ప్రభాస్ 100కోట్లు తీసుకుంటున్నాడు. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. బాహుబలి లాంటి సినిమాకే ఇంత తీసుకున్న ప్రభాస్ ఈ చిత్రానికి మరీ 100కోట్లు అంటే ఏ రేంజ్ లో ఉండబోతుంది అని అందరు ఆలోచనలో పడ్డారు. ఈ చిత్ర ఆగష్టు ౩౦న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.