టాలీవుడ్ భీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. శ్రీనివాస్ ఇటీవల ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ సినిమా ‘రాచ్చసన్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో శ్రీనివాస్, సురేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘రాక్షసుడు’ విజయంతో ఆనందంలో మునిగితేలుతున్న తన కుమారుడి పెళ్లి గురించి సురేశ్ ప్రస్తావించారు. ‘త్వరలోనే శ్రీనివాస్ వివాహం జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా.. బయట నుంచి వాడికి తగిన అమ్మాయి కోసం చూస్తున్నా. ‘రాక్షసుడు’ సినిమాను సక్సెస్ చేసిన తెలుగు వారికి ధన్యవాదాలు అన్నారు.
