టాలీవుడ్ బర్నింగ్ స్టార్ ,హీరో సంపూర్ణేష్ బాబు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.. ఇటీవల హుద్ హుద్ సమయంలో రూ. లక్ష ,తిత్లీ విధ్వంసం జరిగినప్పుడు రూ.50,000లు ఆర్థిక సాయం అందించి గొప్ప మనస్సును చాటుకున్నారు సంపూ. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో వరదలు అల్లోకల్లోలం సృష్టిస్తున్న సంగతి విదితమే. కన్నడ ప్రజల బాధలను అర్ధం చేసుకున్న సంపూ బాధితులకు రూ.2లక్షలు విరాళం ప్రకటించారు. కన్నడ ప్రజలు ఎన్నో దశాబ్ధాలుగా తెలుగు సినిమాలను ఆదరిస్తున్నారు. వారు కష్టాల్లో ఉన్నారు. అందుకే నా వంతుగా అండగా నిలబడటానికి ముందుకొచ్చాను అని సంపూ ప్రకటించాడు.
