యావత్ క్రికెట్ అభిమానులకు ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే.. ఒలింపిక్స్ లో క్రికెట్ పెట్టే అంశం మరోసారి బయటకు వచ్చింది. ఈ మేరకు 2028కి కల్లా క్రికెట్ ను ఇందులో ప్రవేశపెట్టే యోచనలో ఐసీసీ ప్రయత్నిస్తుందని గాట్టింగ్ పెర్కున్నారు. వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ) లో ఇటీవలే బీసీసీఐ చేరడంతో ఉన్న కొన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఒకవేళ అదేగాని నిజం అయితే ఈ ఆటను నెలరోజులు కాకుండా రెండు వారాల్లో ముగించాలి. పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటాయి.