ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి చేస్తాం.. పాడేరులో గిరిజన మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తాం.. గిరిజనులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. ప్రభుత్వంపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని” ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పుకుని చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 600 హామీలిచ్చి అవమానించారని, గిరిజనులకు తెలివి లేదని చంద్రబాబు అవమానించారని ఆమె మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుని తిరిగే చంద్రబాబు కంటే 40 ఏళ్ల వయసున్న సీఎం జగన్ 40 రోజుల్లో చేసి చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓడిపోయారో ఇంకా అర్థం కావడంలేదు. లోకేష్ ను ఓడించిన మంగళగిరి ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఓటమితో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి మారకుంటే 23 సీట్లు కాస్త 3 సీట్లు అవుతాయి అని పుష్పశ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
