ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు సీఎం జగన్ అమెరికా పర్యటన కొనసాగనుంది. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్ వెళ్తారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరతారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆగస్ట్ 17న డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ ప్రసిద్ధిగాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్) లో ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే జగన్ పెద్ద కూతురు హర్షకు లండన్ లోని ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్యాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. ఇలా ఇద్దరు ఉన్నత చదువుల చదవడం నిజంగా తండ్రిగా కూడ జగన్ గ్రేట్ అంటున్నారు వైసీపీ అభిమానులు.
