ప్రస్తుతం టమాట చాలా చాలా హాట్ హాట్ గా ఉంది. ఇండియాతో దాయాది దేశమైన పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలకు గుడ్ బై చెప్పడంతో చాలా మిశ్రమఫలితాలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఇండియా నుంచి తక్కువ ధరకే దిగుమతి చేసుకునే వస్తువుల సరఫరా ఆగిపోవడంతో నిత్యావసరాలు అవసరానికిమొత్తంలో దొరక్కపోవడంతో కాసింత ఇబ్బంది ఎదుర్కుంటున్నారు పాకిస్థానీలు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో టమాట రూ.300లు పలుకుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్ని చవిచూడాలో అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.