ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్దిదారులకు అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించనున్నట్టు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఏంటో ఒక్కసారి చూద్దాం:
*వారి గ్రామాల్లో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందించాలి.
*తమ పరిధిలో ఉండే కుటుంబాల వినతులు, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం పనిచేయాలి.
*విద్య, ఆరోగ్యపరంగా తన పరిధిలోని కుటుంబాలకు అవగాహన కల్పించాలి.
*తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, పరిసరాలు పరిశుభ్రత తదితర వాటిని నిరంతరం పర్యవేక్షించాలి.
*పెన్షన్ పంపిణీ, బియ్యం ఇతర నిత్యావసర వస్తువుల డోర్ డెలివరీ చేయాలి.
*రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల పంపిణీని వలంటీర్ చేపట్టాలి.
*పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో పనిచేసే వలటీర్లు గ్రామ సచివాలయం కోరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి.
*విపత్తుల నిర్వహణ, ఆకస్మిక సంఘటనల నేపథ్యంలో నిర్దేశిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలను అందించాలి.
*మద్యపాన నిషేదం, బాల్యవివాహాలను రూపుమాపేందుకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉంది.
*లబ్ధిదారుల ఎంపిక, సమస్యల పరిష్కారంలో గ్రామ వలంటీర్లదే కీలక పాత్ర. వినతులు పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా వ్యవహరించాలి.
*గ్రామ, వార్డు సచివాలయం నిర్వహించే సమావేశాలకు హాజరు కావాలి.
*లబ్ధిదారుల వివరాలు, ఇతరత్రా సాయం పొందిన కుటుంబాల వివరాలను రికార్డు రూపంలో భద్రపర్చాలి.
Tags andrapradesh grama volenters ys jagan