టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ ధోని వెస్టిండీస్ టూర్ కి దూరమైన విషయం తెలిసిందే. ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న మిస్టర్ కూల్ ప్రస్తుతం కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ధోనికి ప్రస్తుతం ఆర్మీలో ఉన్న హోదా లెఫ్టినెంట్ కల్నాల్.. అంటే ఈ హోదాలో ఉన్నవారికి ప్రత్యేకంగా రూమ్ ఇస్తారు. అంతేకాకుండా ప్రత్యేక ఏర్పాటులు కూడా ఉంటాయి. కాని ధోని మాత్రం రెండు నెలలకు ముందు ఆర్మీ కి ఒక లేక రాసాడు అందులో నాకు కల్పించిన హోదా ప్రకారం కాకుండా నార్మల్ డ్యూటీ వెయ్యమని చెప్పాడట. ఈ మేరకు ధోని చెప్పినట్టుగానే అతనికి జనరల్ గార్డ్ డ్యూటీ వెయ్యడం జరిగింది. ఇప్పుడు వాళ్ళతో పాటుగానే గుడారాల్లో ఉంటూ ఉదయం 5గంటలకు లేచి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు ధోని.
