టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. చిల్లరి తో మొదలుపెట్టి వేలకోట్లు వరకు అంతా దోచుకున్నారు. ఇదంతా చంద్రబాబు అండతోనే చేస్తున్నారు. ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి బాబు దగ్గరికి వస్తే బాబు గారు ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబ ప్రయోజనాల కోసం చూసుకున్నాడు తప్ప ఏ రోజు ప్రజలకోసం పట్టించుకోలేదని చెప్పాలి. పార్టీ నాయకుడే అలా ఉంటే ఇక మిగతా వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.పాలిచ్చే ఆవు, పాలు మరవని దూడ కలిసి ఆ ‘కోడె’ల సంగతి చూడండి.
గత ఐదేళ్లు వాళ్ళన్ని ఆంబోతులా జనంపైకి వదిలారు. దీంతో విచ్చలవిడిగా రెచ్చిపోయిన కోడెల గుంపు పొడిచి, తన్నని వారే లేరు. ఇకనైనా దొడ్లో కట్టేయండి. లేకపోతే తరిమేయండి అని విజయసాయి రెడ్డి అన్నారు. ఎలాగు నాలుగు రోజుల్లో గుదె కట్టి గుంజలకు కట్టేయక తప్పదు ప్రభుత్వానికి అని అన్నారు. కోడెల కుటుంబం మొత్తం గడిచిన ఇదేల్లో ప్రజలపై పడి ఎన్నో అక్రమాలకూ. దౌర్జన్యాలకు పాల్పడిన విషయం తెలిసిందే. తన తనయుడు, కూతురు అధికారంలో ఉన్నామనే అహంకారంతో చెయ్యని అన్యాయం లేదు. ఈ మేరకు ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు సరైన బుద్ధి చెప్పడంతో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పటికే వారిపై కొన్ని స్టేషన్ల లో కేసులు కూడా నమోదయ్యాయి.
ఓటు వేయక పోతే ఇళ్లు కూలుస్తారా అంటూ చౌకబారు మాటలు మీకే సాధ్యం చంద్రబాబు గారూ. మా ఎమ్మెల్యేలను గెలిపించని చోట రూపాయి ఇవ్వం అని సిగ్గులేకుండా చెప్పిన చరిత్ర మీది. పార్టీలకతీతంగా ప్రజలందరినీ ఒకేలా చూస్తామన్న జగన్ గారి హుందాతనం మీకెప్పటికీ రాదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 12, 2019