తెలంగాణ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఈ రోజు సోమవారం ఉదయం బయల్దేరి వెళ్ళిన సంగతి విదితమే.అందులో భాగంగా ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు సీఎం కేసీఆర్.
రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఘనస్వాగతం పలికారు.
అనంతరం కేసీఆర్ కంచికి బయల్దేరారు. కుటుంబ సమేతంగా కంచి అత్తివరదరాజ స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు సీఎం కేసీఆర్ దంపతులు.