ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పి కేవలం 23 సీట్లకే పరిమితం చేసారు. ఇక జనసేన విషయానికి వస్తే కేవలం ఒకే ఒక సీట్ గెలుచుకుంది. అది కూడా పవన్ కళ్యాణ్ కాదు రాజోల్ ఎమ్మెల్యే. ఆ పార్టీ తరుపున నేనే గెలిచానన్న ధైర్యంతోనో లేదా ఎమ్మెల్యే అన్న గర్వంతోనో తెలీదు గాని రోజురోజుకు సామాన్య ప్రజలను కొంచెం బయాందోళనకు గురి చేస్తున్నాడు. రాజోలు నియోజకవర్గం మలికిపురం పోలిస్ స్టేషన్ పరిధి ఎస్ఐ కొంతమంది పేకాట రాయుడులను అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి జనసేన ఎమ్మేల్యే రాపాక వారిని వదిలేయమని అతనిని కోరగా అందుకు ఎస్ఐ నిరాకరించి వారిని వదలలేదు.
ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగాని అనుహ్యంగా నిన్న రాత్రి SI నన్ను తిట్టాడు , పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాలుస్తానని బెదిరించాడని ఒక దళిత ఎమ్మేల్యేని ఇలా అవమానిస్తారా అంటూ జనసేన కార్యకర్తలతో పోలిస్ స్టేషన్ ముందు దర్నా చేసి అక్కడ అధికారులను మరియు సామాన్య ప్రజలను కాస్త బయాందోళనకు గురి చేసారు. ఇందులో భాగంగానే కొంతమంది రాళ్ళు రువ్వి ఆ పోలిస్ స్టేషన్ అద్దాలు పగులగొట్టారు. ఎమ్మెల్యే రాపాక ఇంత గొడవ చేయడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే.. ఇదే ఎస్ఐ గారు పది రోజుల క్రితం అక్రమ ఇసుక రవాణా కేసులో ఎమ్మెల్యేకు చెందిన ట్రాక్టర్ ను అడ్డుకున్నాడు. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాపాక తనమీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలుస్తుంది.