విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది భరత్ కమ్మ. గత నెల 26న నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని విజయ దేవరకొండకి ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమాతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవలనుకున్న విజయ్ కు దెబ్బ పడింది. అంతేకాకుండా కలెక్షన్లు విషయంలో కూడా పూర్తిగా విఫలం అయ్యింది. 7కోట్ల మేరకు నష్టాని చవిచూసింది. స్టొరీ బాగున్నపట్టికి సినిమా స్లోగా ఉండడంతో అంతగా ఎక్కలేదు. దీంతో 13నిముషాలు కట్ చేసారు, కాని అప్పటికే లేట్ అవ్వడంతో మొదటికే మోసం వచ్చింది.