తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ముస్లీం సోదరసోదరిమణులకు ముస్లిం ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దానగుణానికి, మానవత్వానికి ప్రతీకగా జరుపుకొనే బక్రీద్ ఒక స్ఫూర్తి దాయకమైన పండుగ అని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు, విధానాలు అందరికీ అనుసరణీమైనవని తెలిపారు.
