తూర్పుగోదావరి జిల్లాలో వరద గోదావరి శాంతించిది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.30 అడుగులకు వరద నీటిమట్టం తగ్గింది. ఉదయం 5 గంటలకే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మరో అడుగున్నర తగ్గితే 10 గంటల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక ను ఉపహంరించే అవకాశాలున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 12 లక్షల 40వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజ్ లోని 175 గేట్లను ఇంకా పూర్తిగా ఎత్తిఉంచారు. వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం ఆఫ్ స్ట్రీమ్ స్పిల్ వే రిజర్వాయర్ వద్ద 28.10 మీటర్ల వరద నీటిమట్టం వుంది. కాఫర్ డ్యాం ఎఫెక్ట్‌తో జలదిగ్భంధంలోనే ఇంకా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలున్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో కోనసీమలో జలదిగ్భంధంలో చిక్కుకున్న లంక గ్రామాలు తేరుకుంటున్నాయి. భద్రాచలం వద్ద 35.5 అడుగులకు వరద నీటిమట్టం చేరుకుంది. పది రోజులుగా ముంపులో వున్న వరద బాధిత గ్రామాల ప్రజలు వరద లాగుతుండటంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు.
