తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు శనివారం హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ వికాస సమితి మూడో రాష్ట్ర మహాసభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ వికాస సమితి భిన్నాభిప్రాయాలను పంచుకునే వేదిక” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ” విభిన్న భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్ మహానగరంలో స్వేచ్ఛ ఉందన్నారు. పాలనలో ఏమైనా తప్పులున్నా ఎత్తి చూపే స్వేచ్ఛ వికాస సమితికి ఉంది అని అన్నారు. భాషకు మతం ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎప్పుడూ చెబుతుండేవారు. ముస్లింల కంటే అనర్గళంగా ఉర్దూ మాట్లాడే ఇతరులు చాలా మంది ఉన్నారు. లౌకికవాద దేశమంటే మతాన్ని రద్దు చేయడం కాదు. ఒక మతాన్ని వ్యతిరేకించడం, లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను పరస్పరం గౌరవించుకోవడం. మతం, రాజకీయం విడదీయలేనంత ప్రమాదకరంగా పెనవేసుకుపోతోంది అని ఉద్ఘాటించారు.అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిది. ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడింది. తెలంగాణలో మతభేదం లేకుండా జీవనం కొనసాగుతోంది అని ఆయన పేర్కొన్నారు.
Spoke about the ‘Role of democratic forces in light of communalism in politics’ at the Telangana Vikasa Samiti’s third annual meeting
Was a delight to hear the insightful & incisive speech of Prof. Neera Chandoke pic.twitter.com/85Ggj9OGI2
— KTR (@KTRTRS) August 10, 2019