ప్రముఖ సినీ హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ నటీనటుల లుక్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
