ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత టీడీపీ నేత లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి పేరుతో గతంలో అధికారంలో ఉన్నపుడు మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్‌లు యువతను దారుణంగా మోసంచేశారని రోజా మండిపడ్డారు. గురువారం పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్ మొట్టమొదటిగా తయారుచేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను రోజా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ 4లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘనతేనన్నారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా జగన్ చట్టం చేశారనన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొదిస్తామన్న రోజా అసలు లోకేశ్ కు ఏ విధమైన స్కిల్స్ లేవని అయినా చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టారని రోజా అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నైతిక హక్కు టీడీపీకి, చంద్రబాబుకు, లోకేశ్ కు ఏమాత్రం లేవన్నారు రోజా.
