66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగుచిత్రాలకు అవార్డుల పంట పండింది. మహానటి,రంగస్ధలం,అ!,చిలసై సినిమాలకు 7 పురస్కారాలు దక్కాయి. వీటిలో మహానటికే మూడు అవార్డులు రాగా జాతీయ ఉత్తమనటిగా కీర్తిసురేశ్ ఎంపికైంది. అంతేగాదు తెలుగులో మహానటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తాచాటడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ గుర్తిచింది. జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్‌తో పాటు మహానటి టీంకి అభినందనలు. అలానే రాహుల్ రవీంద్రన్, రంగస్థలం టీం తో పాటు నానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
#NationalFilmAwards2019 have recognised & honoured the talented Telugu Film Industry
Many congratulations to @KeerthyOfficial on being chosen best actor & to team #Mahanati @nagashwin7 and #Swapna ?@23_rahulr for #ChiLaSow ?#Rangastalam team?@NameisNani and team #Awe?
— KTR (@KTRTRS) August 10, 2019