Home / ANDHRAPRADESH / రాజు మంచివాడైతే తన రాజ్యంతో పొరుగు రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని ఇందుకే అంటారా.?

రాజు మంచివాడైతే తన రాజ్యంతో పొరుగు రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని ఇందుకే అంటారా.?

రాజు మంచి వాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందనే సామెత తాజాగా మరోసారి చర్చకు వచ్చింది.. కారణం.. రాజు మంచితనం వల్ల తన రాజ్యంతో పాటు ఇతర రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉందంటూ పొరుగు రాష్ట్రమైన తమిళులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆరాజు ఎవరనుకుంటున్నారా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెన్నై ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతుంటే వారికి నీరిచ్చి ఆదుకున్నారు జగన్.. చెన్నై ప్రజల గొంతుతడిపి వారి కష్టాలు తీర్చాలని తమిళనాడు మంత్రుల బృందం విఙ్ఞప్తి చేయడంతో జగన్‌ సానుకూలంగా స్పందించారు. తాగునీటికోసం లక్షలాదిమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదర భావంతో మెలగాలని, వారితో జగన్‌ అన్నారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలన్నారు. తమిళనాడు సీఎం పళనిసామి ఆదేశాలమేరకు మున్సిపల్‌ శాఖామంత్రి గణేశన్, పాలనాసంస్కరణల మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌ లు జగన్‌ను కలిశారు. తాగడానికి నీళ్లులేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. జగన్ సానుకూలంగా స్పందించడంతో తమిళనాడు మంత్రుల బృందం జగన్ కు ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలుపుతూ అడగగానే మానవత్వంతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజు అని, రాజు మంచివాడు కాబట్టే ఆంధ్ర ప్రదేశ్ పక్క రాజ్యమైన తమిళనాడు కూడా సుభిక్షంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తమిళనాడులోనూ వైఎస్ కుటుంబం పట్ల అభిమానంతో ఉంటారని, ఇప్పుడు జగన్ చేసిన సాయాన్ని తమిళ తంబీలు మర్చిపోమంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat