మనిషి జననం నుండి మరణం వరకు ప్రజలకు కనీస అవసరాలు తీర్చలన్నది… ఊరిలో స్మశాన వాటిక…మనిషి చనిపోతే దహన సంస్కారానికి ఖర్చు ఇస్తే ఎంతో పుణ్యం అని. మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారి సంకల్పం… ఆదిశగా ఇటీవల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉచితంగానే దహన సంస్కారాలు చేసే కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు శ్రీకారం చుట్టారు..
అందుకు తొలి గ్రామంగా గుర్రాల గొంది సర్పంచ్ అంజనేయులు ముందుకు రావడం తో ఇటీవల మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అంతిమ సంస్కారాలు ఉచితంగా నిర్వహించే రాష్ట్రంలో తొలి గ్రామంగా గుర్రాల గొంది ని ప్రకటించారు.. ఆ దిశగా హరిశ్ రావు గారితో పాటు , సర్పంచ్ పలువురు ముందు కు వచ్చి దాదాపు 8లక్షల వరకు విరాళాలు ఇచ్చి ఉచిత దహన సంస్కారానికి ఊతం ఇచ్చారు… హరిశ్ రావు గారి ఆలోచన కు సిద్దిపేట ప్రజాప్రతినిధులు ఆచరణలో చూపించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతారు అనటానికి ఇదే నిదర్శనం …
గుర్రాల గొందిలో ఉచితంగా అంతిమ సంస్కారం అని ఐటీవల మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రకిటించారు..గ్రామంలో ఈరోజు 85 సం.ల కంకణాల చంద్రవ్వ మృతి చెందగా గ్రామ సర్పంచ్ , పాలకవర్గం గ్రామ పంచాయతీ నుండే దహన సంస్కారాలు నిర్వహించారు..” గ్రామ సర్పంచ్ అంజనేయులు స్వయంగా పాడె మోసి ఉచితంగా నిర్వహించడం అంటే కుటుంబానికి డబ్బులు ఇవ్వడం కాదు…” పాలక వర్గం దగ్గర ఉండి దహన సంస్కారాలు నిర్వహించడం అని చాటి చెప్పారు.. స్పూర్తిని చాటుకున్నారు… గుర్రాల గొంది నుండి ఉచితంగా.. గౌరవంగా దహన సంస్కారాలు నిర్వహించే తొలి గ్రామంగా సిద్దిపేట నియోజకవర్గం మరో సారి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది…
Post Views: 305