తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని రైతులకు సాగునీరు ఇవ్వడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ గేట్లు ఎత్తాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆదివారం ఉదయం నాగార్జున సాగర్ లో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంయుక్తంగా కుడి, ఎడమ గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తారు. అనంతరం ఎల్.ఎల్.సి, ఎఎంఆర్ కాలువల ద్వారా మంత్రి జగదీష్ రెడ్డి నీటి విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను మంత్రి జగదీష్ రెడ్డి ఆహ్వానించారు.