Home / ANDHRAPRADESH / చంద్రబాబునాయుడు తన అసలు వైఖరి ఏమిటో బయటపెట్టుకున్నారు..ఏం జరిగిందో తెలుసా

చంద్రబాబునాయుడు తన అసలు వైఖరి ఏమిటో బయటపెట్టుకున్నారు..ఏం జరిగిందో తెలుసా

నిజం మాట్లాడుతున్నందుకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తప్పు పడుతున్నారు. ఇలా మాట్లాడితే.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని నిలదీస్తున్నారు. జగన్మోహన రెడ్డి నిజం చెప్పడం ద్వారా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నట్లుగా బాధపడిపోతున్నారు. ఆయన వైఖరి, మాటలు గమనిస్తోంటే.. అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు, వంచనతో కూడిన మాయమాటలు చెప్పాలే తప్ప నిజం చెప్పరాదు అన్నట్లుగా కనిపిస్తోంది.  విజయవాడలో ప్రస్తుతం 35 దేశాలనుంచి వచ్చిన దౌత్య ప్రతినిధులతో ప్రతిష్టాత్మకమైన ‘డిప్లమాటిక్ అవుట్ రీచ్’ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కీలక ప్రసంగం చేశారు. పెట్టుబడులతో వచ్చేవారికి తమ రాష్ట్రం అనల్పమైన అవకాశాలు కల్పిస్తున్నదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు ఉన్న ప్రత్యేకమైన సానుకూల అంశాల గురించి కూడా వివరించారు.

పరిశ్రమలు స్థాపించదలచుకునే వారికి అవసరమయ్యే నైపుణ్యాలు గల మానవ వనరులను, సమృద్ధిగా అందుబాటులో ఉంచడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కూడా చెప్పారు. అందుకు పెట్టుబడిదార్లు నిధులు ఖర్చు పెట్టక్లర్లేదని, ప్రతి ఎంపీ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇవన్నీ కూడా పెట్టుబడిదార్లను ఆకర్షించే విషయాలే. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఈ మాటల్లో చిత్రమైన తప్పులు వెతికారు. ఇంతకూ ఆయన ఏమంటున్నారో తెలుసా? ‘‘పీపీఏల వివాదం, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు, డిస్కమ్ అప్పుల గురించి రాయబారుల సదస్సులో చెప్పవచ్చునా’’ అంటూ చంద్రబాబు నిలదీస్తున్నారు. ఇలాంటి మాటల పెట్టుబడులు వెనక్కిపోతాయే తప్ప, ఎవరూ ముందుకు రారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.

మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి ఇక్కడ ఉన్న వాస్తవాలు, రాష్ట్ర యువతరానికి హామీ ఇచ్చినట్లుగా 75 శాతం ఉద్యోగాల గురించిన నిబంధన గురించి కూడా చెప్పకపోతే.. ఎలా? చూడబోతే.. మాయమాటలు చెప్పి, అబద్ధాలు వల్లించి, వాస్తవాలపై ముసుగువేసి.. పెట్టుబడిదార్లను ఆకర్షించాలి అనేది చంద్రబాబునాయుడు నమ్మిన విధానంలాగా కనిపిస్తోంది. అందుకే కాబోలు.. ఆయన సీఎంగా జరిగిన సదస్సుల్లో ఒప్పందాలు చేసుకున్న పారిశ్రామికవేత్తల్లో పదిశాతం కూడా పరిశ్రమలు స్థాపించిన దాఖలాలు లేవు. అంత్య నిష్టూరం కంటె ఆది నిష్టూరం మేలని.. జగన్ ఉన్నదున్నట్టు చెబుతోంటే.. చంద్రబాబు నిజం చెప్పడమూ తప్పే అనడం చిత్రమే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat