ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ గేట్‌వేలో హోటల్ లో డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సును ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో సీఎం జగన్ కీలక ఉపన్యాసం చేపారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పెట్టుబడులు, టూరిజం, హెల్త్ సెక్టార్ వంటి కీలక అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ జగన్ పలువురు రాయబారులు, కాన్సులేట్ జనరల్‌లతో ముఖాముఖి నిర్వహించారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముఖ్యంగ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే అంశంలో మాత్రం జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలని కండిషన్లు పెట్టారు. దీనిపై ఇన్వెస్టర్లకు కూడా వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు లేకపోతే ఎవ్వరూ భూములు ఇవ్వరని వివరించారు. అయితే ఎటువంటి లోపాయకారీ ఒప్పందాలు లేకుండా పారదర్శకంగా అన్ని అనుమతులు ఇస్తామని ఎటువంటి అనుమానం లేకుండా వెల్లడించారు. ఈ సదస్సులో యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే దిశగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి వ్యాపార ప్రధాన రంగాలను పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
