ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ప్రాజెక్టు ఆరో నెంబరు గేటును ఎత్తారు. ప్రాజెక్టుకు ఎగువనుంచి 4,69,159 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతుంది.
