మూవీ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే సూపర్ డూపర్ హిట్ ఏంటని ఆలోచిస్తోన్నారా..?. మీకేమన్నా పిచ్చా.. రేటింగ్ కోసం ఇలా టైటిల్ పెట్టి రాస్తోన్నారా..?. ఈ రోజు మహేష్ బర్త్ డే కాబట్టి ఏమి రాసిన వీక్షకులు చదువుతారని మీ ఆలోచన అని మమ్మల్ని తిట్టుకోవద్దు. అసలు ముచ్చట ఏంటో ఈ వార్తను చదివిన తర్వాత మీరే చెప్తారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అని.. ఇటీవల విడుదల అయిన టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తూ భారీ కలెక్షన్లతో మహర్షి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ ,ఈ రోజు బర్త్ డే బాయ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి విదితమే.
యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే నేడు మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఇంట్రో టీజర్ విడుదల చేశారు. ఆర్మీ మేయర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్‌ని చూసి ఈ చిత్రం భారీ విజయం సాధించడం ఖాయం అని ఇటు సినీ విశ్లేషకులు, అటు తెలుగు సినిమా అభిమానులతో పాటు మహేష్ అభిమానులు సైతం జోస్యాలు చెబుతున్నారు.
అయితే సెంటిమెంట్ పరంగాను ఈ సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇరవై ఐదేళ్ల సినీ మహేష్ బాబు కెరీర్‌లో భారీ విజయం సాధించిన ఒక్కడు, దూకుడు చిత్రాలలో ఆయన అజయ్ అనే పాత్రలో కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రంలోను అజయ్ పాత్రలోనే నటిస్తున్నాడు. దీంతో సెంటిమెంట్ పరంగా ఈ సినిమా భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.హాట్ అండ్ క్యూట్ అందాల భామ రష్మిక మంధాన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి పండుగక్కి కానుకగా విడుదల చేయడానికి చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది.