టీమిండియా మాజీ సారధి ప్రస్తుత భారత కీపీర్ మహేంద్రసింగ్ ధోని విండీస్ టూర్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ లో భాగంగా ధోని రెండు నెలలు క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. ఈ మేరకు ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే మోదీ సర్కార్ జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోని పుల్వామా జిల్లా క్రూ ప్రాంతాల్లో తన విధులు నిర్వతిస్తున్నాడు. తన తోటి సైనికులతో కలిసి ఉంటూ విధుల్లో పాల్గుంటున్నాడు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రకారం జమ్ముకశ్మీర్ లో ప్రతీ వీధిలో జాతీయ జెండా ఎగరవేయ్యాలి. ఈ నేపధ్యంలో ధోని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగరవేయనున్నారని తెలుస్తుంది. ఈ మాట తెలుసుకున్న ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.