Home / ANDHRAPRADESH / ట్విట్టర్‌లో అడ్డంగా దొరికిన బాబు… పోయే పరువుంతా పోయే…!

ట్విట్టర్‌లో అడ్డంగా దొరికిన బాబు… పోయే పరువుంతా పోయే…!

ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మారుతాడు తెలుగు తమ్ముళ్లు అనుకున్నారు కానీ…ఏ మాత్రం మారలేదని బాబుగారి చేష్టలే చెబుతున్నాయి. ఓటమిని హుందాగా ఒప్పుకోవాల్సి పోయి అసలు ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదంటూ బాబుగారు ఇంకా తనను తాను మోసం చేసుకుంటూనే ఉన్నాడు. ఇక బాబుగారు తన హయాంలో జరిగిన అవినీతిపనులను, చర్యలను 50 రోజుల జగన్ పాలనలో జరిగినట్లు ప్రచారం చేస్తూ….ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ అభాసు పాలవుతున్నారు. కియా కార్ల విషయంలో అడ్డంగా నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. కియా ఫ్యాక్టరీ నుంచి తొలి కారు ఇటీవల లాంచింగ్ అయింది. దీంతో నారా లోకేష్ ఒక దార్శనికుడి కృషికి నిదర్శనం….కియా నుంచి తొలి కారు అంటూ…ట్వీట్ చేశాడు. దీంతో నెట్‌జన్లు ఓ రేంజ్‌లో చినబాబును ఆడుకున్నారు. నిజానికి ఎలక్షన్ల ముందు తొలి కియా కారు లాంచింగ్ అంటూ చినబాబు, పెదబాబులు తెగ హడావుడి చేశారు. ఇంకా కారు ప్రొడక్ట్ పూర్తి కాకున్నా..ఒక పెద్ద కారును తీసుకువచ్చి నల్ల గుడ్డ వేసి లాంచింగ్ చేశారు తండ్రీ కొడుకులు. తాజాగా కియా నుంచి ఫస్ట్ కారు అంటూ లోకేషం ట్వీట్ చేయడంతో మరి మీ బాబు లాంచ్ చేసిన కారు ఏంటీ అంటూ నెట్‌జన్లు లోకేషాన్ని ఏకిపడేశారు. దీంతో చినబాబు పరువు అడ్డంగా పోయింది. తాజాగా చంద్రబాబు కూడా ఆశావర్కర్ల విషయంలో ఓ ట్వీట్ పెట్టి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోయాడు.

ఏపీ నూతన సీఎం జగన్‌మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి 50 రోజులు కాకముందే చంద్రబాబు అడ్డగోలుగా కువిమర‌్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆశా వర్కర్లు జగన్ ఫోటోకు పాలాభిషేకం చేస్తున్న ఫోటోను నిన్న అని.. మరో ఫోటోలో ప్రభుత్వ దిష్టిబొమ్మను శవయాత్ర చేస్తున్న ఫోటోను నేడు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బాబు అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయానికి వస్తే ఆశా వర్కర్ల జీతాల్ని రూ.10వేలుకు పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆశావర్కర్లు సంబురాలు చేసుకున్నారు. ఆ సమయంలో సీఎం జగన్ ఫోటోలకు ఆశావర్కర్లు పలు చోట్ల పాలాభిషేకాలు చేశారు. అయితే బాబు పోస్ట్ చేసిన రెండో ఫోటో విషయంలో తప్పులో కాలేశారు. అప్పుడెప్పుడో 2017లో కేసీఆర్ సర్కారు తీరుకు నిరసనగా అక్కడి ప్రజలు చేసిన నిరసన ప్రదర్శన ఫోటోను తాజాగా చేసిందిగా భావించి పోస్ట్ చేసిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అయ్యా అది ఏపీలో జరిగింద కాదయ్యా..అప్పుడెప్పుడో తెలంగాణలో జరిగిందయ్యా…తెలంగాణలో కూడా ఆశావర్కర్ల కేసీఆర్ జీతాలు పెంచి వారి జీవితంలో వెలుగులు నింపారు. జగన్, కేసీఆర్‌లు మీకులాగా అంగన్‌వాడీల కార్యకర్తలపై లాఠీచార్జీలు చేయించలేదు..ఇంటికి పిలిచి జీతాలు పెంచి కమ్మని భోజనం పెట్టి పంపించే మంచి మనసున్న నేత….కేసీఆర్‌ది అని నెట్‌జన్లు బాబుగారిని చెడుగుడు ఆడుకున్నారు. అలాగే జగన్ కూడా అడగక ముందే జీతాలు పెంచి ఆశావర్కర్ల జీవితాల్లో ఆనందాన్ని తీసుకువచ్చారు అని నెట్‌జన్లు కౌంటర్లు వేశారు. అసలు నీ  కొడుకే మాలోకం అంటే..మీరు పెద్ద మాలోకంలా ఉన్నారు అని…చంద్రబాబు‌‌ను ఉతికి ఆరేశారు. అందుకే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అనేది. మొత్తానికి జగన్‌ని బద్నాం చేద్దామని చేసిన పోస్ట్ రివర్సై బాబుగారు పరుపు పొగొట్టుకున్నారు

.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat