వామపక్ష పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటివరకూ పార్టీలకు జాతీయహోదా రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సిపిఐ, సీపీఎం పార్టీలకు జాతీయపార్టీ హోదాను రద్దుచేస్తూ కేంద్ర ఎన్నికలసంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికలసంఘం 2013 లో జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా సీపీఎం, సీపీఐ పార్టీలకు జాతీయహోదా రద్దుచేసినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా రావాలంటే రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరుశాతం ఓట్లు సాధించాలి. అలాగే కనీసం రెండు అసెంబ్లీ స్థానాలైనా అయినా కైవసం చేసుకోవాలి.. అంతే కాకుండా ఆరాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో కనీసం ఆరుశాతం ఓట్లతో పాటు ఓ లోక్‌సభ స్థానాన్ని గెలవాలి. ఆరాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని అయినా గెలవాలి. అలా కానిపక్షంలో ఆరాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3శాతం ఓట్లు లేదా మూడు అసెంబ్లీస్థానాల్లో అయినా గెలవాలి. లోక్‌సభ లేదా శాసన సభలో గతఎన్నికల్లో ఆపార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8శాతం ఓట్లు వచ్చి ఉండాలి. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు కనీసం ప్రభావం చూపకపోవడంతో ఆపార్టీలకు జాతీయపార్టీ హోదాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆయా పార్టీలు ఇంకా స్పందించలేదు.. ఇప్పుడు ఆ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
