నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల అంశం, పాలనా విధానం, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది.
ఇందులో భాగంగా జగన్ ప్రకటించిన మద్యపాన నిషేధంపై ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఈ అంశంపై చాలామంది ప్రజలు ఇది చాలా మంచి కార్యక్రమం అని, జగన్ మద్యపానాన్ని నిషేధిస్తాననడం నమ్ముతామని 80మంది చెప్పగా.. 15శాతం మంది నమ్మలేం అన్నారు. కేవలం 5శాతం మాత్రమే చెప్పలేం అని సమాధానం ఇచ్చారు.అయితే మందిశాతం మంది (వీరిలో ఎక్కువమంది మహిళలు) మాత్రం కాపురాల్లో చిచ్చులు పెట్టే మద్యపానాన్ని నిషేధించడం చాలా గొప్ప విషయమని, సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తే చాలామంది ఆరోగ్యాలకు, కుటుంబాలకు మంచి జరుగుతుందన్నారు. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం అందుకు ప్రణాళికలు రచిచడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. ముఖ్యంగా గత పాలనలో గుడిపక్కన, బడిపక్కన బెల్ట్ షాపులు తెరచి ప్రజల్ని మద్యానికి బానిసలుగా మార్చిన చంద్రబాబు సర్కార్ కంటే మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ కు అక్కచెల్లెమ్మలు, కొందరు పురుషులు సైతం రుణపడి ఉంటామని వెల్లడించారు.