ఇటీవల నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని.. వైసీపీ సర్కారు ఏర్పడి యాబై రోజులవుతున్న సందర్భంలో ఒక ప్రముఖ ఏజెన్సీతో కల్సి ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు యాబై రోజుల పాలనపై సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాబై వేల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ క్రమంలో గత యాబై రోజులుగా వైసీపీ సర్కారు ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు ఆధారంగా సర్వేలో ప్రజాభిప్రాయం సేకరించడమైంది. అందులో భాగంగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైసీపీ యాబై రోజులపాలనపై మీ అభిప్రాయం ఏమటని అడగ్గా దాదాపుగా ఎక్కువ మెజారిటీ ప్రజలు జగన పాలనపై బాగుందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా అర్హులకు అందుతున్న పింఛన్ ,సర్కారు స్కూళ్లు,ఆసుపత్రులల్లో అందుతున్న సేవలతో పాటుగా రెవిన్యూ తదితర విభాగాల్లో ఎటువంటి లంచం ఇవ్వకుండానే పనులు జరుగుతున్నాయని మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక సర్కారు ఆసుపత్రులల్లో అందుతున్న వైద్యసేవల గురించి అడిగిన సమయంలో గతంలో టీడీపీ పాలన కంటే ఇప్పుడు వైసీపీ పాలనలోనే పేదలకు నాణ్యమైన శరవేగంగా వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. రెవిన్యూ ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీటిలోనూ గతంతో పోలిస్తే పారదర్శకంగా ఎటువంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా ఎలాంటి ఎమ్మెల్యే మంత్రి సిపారస్ లేఖలు అవసరం లేకుండానే ప్రతి ఒక్కరికి సేవలు అందుతోన్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాబై రోజుల జగన్ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించగా వీరిలో జగన్ పాలనలో ప్రభుత్వ పథకాలు అమలుతో పాటు పాలన బాగుందన్నా వారు 80%,బాగాలేదన్నవారు 15%,పర్వాలేదు అన్నవారు 05% జగన్ పాలనపై తమ భిప్రాయాలను వ్యక్తం చేశారు..మొత్తంగా చూస్తే యాబై రోజుల జగన్ పాలన బాగుందని అన్నవారు 80% మంది వైసీపీ సర్కారుకు జై కొట్టారు..