మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గుండె పోటుతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. సుష్మా మరణంతో దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మాజీ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి ఫొటోలను అప్ లోడ్ చేశారు. ఈ పోస్టుకు స్పందించిన ఓ పాకిస్థానీ నెటిజెన్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఆమె చనిపోయారని… ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని షోయబ్ అనే పాకిస్తాన్ నెట్‌జన్ ట్వీట్ చేశాడు. దీంతో స్పందించిన టీఆర్ఎస్ కేటీఆర్ ఆ పాకిస్థానీ నెట్‌జెన్‌పై మండిపడ్డారు. సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని మండిపడ్డారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే… మీరు పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని అన్నారు. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోగలని ట్వీట్ చేశారు. సుష్మాస్వరాజ్ మరణంపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన పాకిస్తానీ నెట్‌జన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన కేటీఆర్‌ను నెట్‌జన్లు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఎందరో ప్రాణాలు కాపాడిన అమ్మ..సుష్మా అని అలాంటి మానవతామూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ యువకుడికి కేటీఆర్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Absolutely ridiculous & shows your hollow mindset to comment on a leader after her untimely death
Shoaib, Even if you’re from Pakistan as your profile says, I hope you can gather some courage & decency to respect someone like #SushmaSwaraj Ji who served the public all her life https://t.co/8akEYqKjYU
— KTR (@KTRTRS) August 7, 2019