నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల అంశం, పాలనా విధానం, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది.
ఇందులో భాగంగా జగన్ చేపట్టిన విద్యావిధాన మార్పులపై ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఈ అంశంపై చాలామంది ప్రజలు ఇది చాలా మంచి కార్యక్రమం అని, జగన్ విద్యా వ్యవస్థను తప్పకుండా ప్రక్షాళణ చేస్తారని తాము నమ్ముతామంటున్నారు. 80శాతం మంది బావుంది అని చెప్తుండగా.. 17శాతం మంది బాగాలేదని, కేవలం 3శాతం మాత్రమే చెప్పలేం అని సమాధానం ఇచ్చారు. పాదయాత్రలో జగన్ పదేపదే ప్రస్తావించిన అంశం విద్యావిధానం.. ముఖ్యంగా గత పాలనలో ప్రైవేటు స్కూళ్లకు దోచి పెట్టేందుకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసింది. ఈ క్రమంలో జగన్ ప్రతీ స్కూల్ రూపు రేఖలు మార్చుతానని, పిల్లల భవిష్యత్తు మారి ఉన్నతవిద్య చదివి, ఉద్యోగాలు సాధించినపుడే పేదల జీవితాలకు మంచి జరిగుతుందని జగన్ నమ్మారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పధకాన్ని తండ్రి రాజశేఖరరెడ్డి కంటే ఉత్తమంగా అమలు చేస్తానని జగన్ ప్రకటించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యతో పాటుగా, అమ్మఒడి పధకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.