Home / ANDHRAPRADESH / ఏపీలో నవరత్నాల అమలుపై దరువు ఎక్స్ క్లూజివ్ సర్వే..!

ఏపీలో నవరత్నాల అమలుపై దరువు ఎక్స్ క్లూజివ్ సర్వే..!

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న తీరు వంటి అంశాలపై దరువు సమగ్రంగా సర్వే నిర్వహించింది.ఈ క్రమంలో నవరత్నాల అమలుపై సీఎం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా దరువు సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం జరిగింది. మహిళలు, వృద్ధులు, యువత, ఉద్యోగులు, రైతులు అందరినీ దరువు పలకరించింది. పట్టణాలు, అర్బన్ ప్రాంతాలతోపాటు రూరల్ గ్రామాల్లోనూ దరువు సర్వే నిర్వహించింది. మొత్తం 50వేలమందిని ఈ సర్వేలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై వారి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది.

ఇందులో భాగంగా నవరత్నాల అమలుపై ప్రజల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. 75 శాతం ప్రజలు మాత్రం నవరత్నాల అమలే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందన్నారు .ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రకటించరని తెలుపుతున్నారు. 23 శాతం మంది బాగాలేదు అంటున్నారు. కేవలం 2 శాతం మంది మాత్రం ఇప్పడే చెప్పలేం అన్నారు.

నవరత్నాలు అమలుపై దరువు ఎక్స్ క్లూజివ్ సర్వే !!!
1. వైఎస్సార్‌ రైతు భరోసా
ఈ పథకంతో రైతన్న కుటుంబానికి ఏటా రూ.12,500 ,
ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్‌ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్‌ ట్యాక్స్‌ మాఫీ చెయ్యడం మంచిదని ప్రజలు అంటున్నారు . అంతేగాక ఆత్మహత్య
చేసుకున్న రైతు కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.5 లక్షలు చెల్లిచడం గొప్ప నిర్ణయం అన్నారు.

2. ఫీజు రీయింబర్స్‌మెంట్‌
పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని చెప్పడంతో ప్రతి పేదవాడు చదువుకుంటారని , విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ఇవ్వడంతో
తల్లిదండ్రలతో పాటు, విద్యార్థులు కూడ సంతోషంగా ఉన్నామాన్నారు.

3. ఆరోగ్యశ్రీ గురించి
ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి జగన్ చెప్పినప్పటి నుండి ఇక ఆరోగ్యం గురించి అస్సలు బాదపడడం లేదు అని దాదాపు ఎక్కువ శాతం
ప్రజలు తెలిపారు. ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిచడంతో దేవునితో పోల్చుతున్నారు.
4. అమ్మఒడి గురించి
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిచడంతో ప్రతి ఒక్కరు విద్యావంతులు అవుతారని అందుకే జగన్ పై నమ్మకంతో గెలిపించామని ప్రజలు
అంటున్నారు.

5. వైఎస్సార్‌ ఆసరా గురించి
పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా ఇస్తామని చెప్పగానే ప్రతి మహిళ కళ్లలో ఆనందం వచ్చిందని జగన్ కే ఓటు వేయ్యాలనే మేము
కొంతమందిని కోరాం అన్నారు.

6. పేదలందరికీ ఇళ్ల గురించి
ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు ఇవ్వడంతో ఇక గుడిసే లో ఉన్నామనే కుటుంభం ఉండదు అని ఆనందం వ్యక్తం చేశారు. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తారని
చెప్పారు నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు.
7. పింఛన్ల పెంపు గురించి
ప్రస్తుతం పింఛన్‌ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిచడంతో పాటు అవ్వతాతలకు 3000 పింఛన్‌ అందిచడం వారి జీవితాల్లో వెలుగు నింపడం…వారిని ఒక
కొడుకు లాగా ఆదుకోవడం మంచిదన్నారు.

8. జలయజ్ఞం గురించి
లక్షలాది రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని రైతులే చెబుతున్నారు.
9. మద్యపాన నిషేధం గురించి
కుటుంబాల్లో చిచ్చుపెడుతూ, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తున్న మద్యం రక్కసిని మూడు దశల్లో నిషేధిస్తారని చెప్పడంతో ఆరోజే మహిళంలందరం ఫిక్స్ అయ్యాం జగన్ కే ఓటు వెయ్యాలని
రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు వెలకట్టలేని సంతోషం కలిగించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని దరువు మీడియా చేసిన సర్వే లో వారి వారి అభిప్రాయాలు తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat