శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రణరంగం. ఈ చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించనున్నారు.అంతేకాకుండా హీరో మొదటిసారి ఈ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. అసలు ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు కాని మల్లా 15కి ఫిక్స్ చెయ్యడం జరిగింది. ఇందులో శర్వానంద్ కు జంటగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నారు. ఈ చిత్రానికి గాను హీరో ప్రభాస్, రాంచరణ్ ఫుల్ సపోర్ట్ చేయడమే కాకుండా బెస్ట్ విషెస్ కూడా తెలిపారు.
