వెస్టిండీస్ టూర్ లో భాగంగా టీమిండియా ఇప్పటికే వెస్టిండీస్ తో రెండు టీ20మ్యాచ్ లు ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి మ్యాచ్ లో కొంచెం తడబడినా మొత్తానికి విజయం అయితే సాధించింది. ఇక రెండో మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ అధ్బుతమైన బ్యాట్టింగ్ తో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత్ ఈరోజు వెస్టిండీస్ తో మూడో టీ20 ఆడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న భారత్ ఈ మ్యాచ్ లో కచ్చితంగా ప్రయోగాలు చేయనుందని తెలుస్తుంది. ఎందుకంటే ఎలాగు సిరీస్ గెలవడంతో జట్టులో మరికొందరికి ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.
