బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు రూపకల్పనలో ఓ తెలుగు అధికారి పాత్ర కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనదే ముఖ్య పాత్ర అని కూడా చెప్పొచ్చు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు రూపకల్పనలో తెలుగువాడు ప్రముఖ పాత్ర పోషించడం అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశం అని చెప్పాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణతోపాటు నాలుగు బిల్లులను సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది.డా. జి.నారాయణ రాజు కేంద్ర న్యాయశాఖలో శాసన వ్యవహారాల లెజిస్లేటీవ్ సెక్రటరీగా 2015లో బ్యాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆరోజు నుండి చట్టాల రూపకల్పన విషయంలో ఈయనే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మోదీ హయంలో వచ్చిన ప్రతీ కీలక బిల్లులో ఆయనదే కీలక పాత్ర.
