ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం వైసీపీ 10కి 10 గెలిచి రికార్గ్ తిరగ రాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఉనికిని గల్లంతు చేసింది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధికారంలోకి రాగానే కొద్ది రోజులు నేతల చేరికతో హడావుడి కొనసాగింది. తాజాగా ఇప్పుడు నెల్లూరు రూరల్‌లో వలసల పర్వానికి నేతలు శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీకి చెందిన నలుగురు మాజీ కార్పొరేటర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరారు. 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాసరి రాజేష్, 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పి.మాధవి భర్త పి.ప్రసాద్, 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ డి. సరోజనమ్మ కుమారుడు వంశీ తదితరులు ఉనికి దాట్లు పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లతో పాటు నెల్లూరు రూరల్ మండలం ఉంది. ఈ క్రమంలో టీడీపీలో ఉన్న మాజీ కార్పొరేటర్లు అందరూ అధికార పార్టీలో చేరేందుకు నేతలతో మంతనాలు నిర్వహిస్తున్నారు.