మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతులకు, ఆడవారుకు ఆశ కల్పించి, ఓట్లకోసం మాయమాటలు చెప్పి చివరికి అందరికి అన్యాయం చేసాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కరువు, రైతుల ఆత్మహత్యలే కనిపించాయి. ఇక అసలు విషయానికి వస్తే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై విషపూరిత ప్రచారాలు చేస్తున్నాడు. తాజా ప్రకటనలో ప్రభుత్వం వచ్చిన అరవై రోజులకే అరవై ఏళ్లు వెనక్కి పోయిందని అన్నాడు. అంతేకాకుండా తమ నాయకుడు చంద్రబాబును పొగడ్తలతో ముంత్తేచ్చారు. మరి ఇంత గొప్పగా తన నాయకుడి కోసం గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి కోసం ఒక లుక్ వేస్తే.. గత టీడీపీ పాలనలో ఆయన ఆర్ధిక మంత్రిగా చేసాడు.
2014 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుండి తన తమ్ముడిని నిలబెట్టగా ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఒక ఆర్ధికమంత్రి సొంత నియోజకవర్గం అంటే ఎలా ఉంటుందో ఎవరికైనా అర్ధమవుతుంది. అలాంటిది తుని విషయానికి వస్తే అక్కడ మాత్రం ఎటువంటి అభివృద్ధి మాత్రం జరగలేదు. అక్కడ ఏ వ్యక్తిని అడిగినా ఛీ..అని ఉమ్మేస్తున్నారని చెప్పాలి. యనమల బ్రదర్స్ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. యనమల అండతో తమ్ముడు దౌర్జన్యాలు, ఇసుక మాఫియా ఇలా ఎన్నో అరాచకాలు చేసాడు. అలాంటిది తన సొంత నియోజకవర్గానికే ఏమీ చేసుకోలేని యనమల ఇప్పుడు జగన్ కోసం, రాష్ట్రం కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుందని నేటీజన్లు స్క్రోల్ చేస్తున్నారు.