ఎప్పుడూ ఏదోక విమర్శతో ముందుంటున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్న సర్ఫరాజ్ తాజాగా తాను చేసిన మరో ట్వీట్ తో వార్తల్లోకి ఎక్కాడు. బక్రీద్ సందర్భంగా కుర్బానీ పై సర్ఫరాజ్ ఓ వీడియోతో పాటు ఫొటోలను పోస్టు చేయడం జరిగింది. దీంతో అతడిపై నెటీజన్లు ఫైర్ అయ్యారు. అతడిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇది ఇలా ఉండగా పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్ తాజాగా సర్ఫరాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. కెప్టెన్సీ నుండి సర్ఫరాజ్ ను తొలిగించాలని పాకిస్తాన్ బోర్డును కోరడం జరిగింది. అతడిని తొలిగించి టెస్టుల్లో బాబర్ ఆజామ్‌ను, పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు షాదాబ్ ఖాన్‌ను కెప్టెన్ గా పెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంపై పీసీబీ నుండి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
