తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
