తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా ధర్మపురి చేరుకున్నారు. ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకె రవికుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పలువురు నేతలు ఉన్నారు.
