జకన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ కధ. మామోలుగా ఈ చిత్రం కోసం ఊహించుకుంటేనే ఇలా ఉంటే ఇంక చిత్రం రిలీజ్ అయితే ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రేక్షకులకు ఈ చిన్న ట్విస్ట్ ఇస్తున్న జక్కన్న సినిమా సౌలభ్యం కోసం వాడుకుంటున్నాడు. ఇదిగాని బయటకు వస్తే విమర్శలు వస్తాయా లేక ప్రశంసల జల్లు కురుస్తుందా అనేది 2020 వరకు ఎదురుచుడాల్సిందే.