సర్కారు నౌకరికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాప్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో సివిల్ ,ఎలక్ట్రికల్ ,మెకానికల్ ఇంజనీర్ పోస్టులను ఎస్ఎస్ఎసీ భర్తీ చేయనున్నది. సంబంధిత బ్రాంచ్ ల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పదమూడో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.మిగిలిన వివరాలకు https://ssc.nic.in/లో చూడవచ్చు.
