కొంతమందికి పొట్ట నిండాలంటే ఇంట్లో మగాడు పొద్దున్న పోయి కష్టపడి వస్తేనే గాని వారికి పూట గడవదు, పొట్ట నిండదు. ఎంత కష్టపడి వచ్చినా సాయంత్రం అయ్యేసరికి మద్యం మహమ్మారి వారిపై ప్రభావం చూపిస్తుంది. ఫుల్ గా తాగేసి రచ్చ మొదలుపెడతారు. సంపాదించిన సొమ్ముమొత్తం దానికే తగలేస్తారు. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం ఆడవారికి మంచి చెయ్యాలనే యోచనలో ముందుకు వెళ్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకారమే ప్రస్తుతం ప్రభుత్వం బెల్ట్‌దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. ఇక ఇప్పుడు షాపుల వద్ద ఉన్న పర్మిట్ రూమ్‌లు రద్దు వంటి ఆలోచనలతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీంతో ఇకనుండి షాపుల దగ్గర తాగేసి రచ్చ చేసే ఆస్కారం లేదు. మందు తీసుకొని ఇంటికి వెళ్లి తాగాల్సిందే.