ఎన్నికల ఫలితాలు వచ్చేసిన తర్వాత నుంచే కాకుండా ఎన్నికలకు ముందు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ఇతర పార్టీలలోకి చేరిపోవడం మనకు తెలిసిందే. అయితే జంపింగ్ స్పెషలిస్ట్ మరియు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రముఖ కీలక నేతగా మారిన గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితంపై సంబంధించి ఒక అంశం కీలకంగా మారుతుంది.తాను ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైనా తనకంటూ ఒక క్యాబినెట్ హోదా ఖాయమని అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఆ పదవిని చంద్రబాబు వేరే ఒకరికి కట్టబెట్టడం గంటాను కలచి వేసిందనే ఒక వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది.అంతే కాకుండా తాజాగా విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విష్ణు కుమార్ రాజు గంటాపై చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. గంటా బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంతే కాకుండా ఈ మధ్య గంటా కూడా ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని కూడా మరో వార్త కూడా వినిపిస్తుంది. టిడిపికి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని తెలుస్తుంది. ఇదంతా గంటా పార్టీ మారేందుకు చేస్తున్న ప్లానింగ్ భాగమే అని కూడా మరికొందరు అంటున్నారు..దీనితో గంటా ఏ సమయంలో అయినా సరే టీడీపీకి గుడ్ బై చెప్పవచ్చు అనే వార్త హాల్ చ్ల చేస్తుంది.
