2019 ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా వీడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన గౌరు వెంకట్ రెడ్డి దంపతులు మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014లో వైసీపీ తరపున గౌరు వెంకట్ రెడ్డి భార్య చరిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత మొన్నటి ఎన్నికల్లో మళ్లీ గౌరు ఫ్యామిలీకి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో… గౌరు ఫ్యామిలీ టీడీపీలో చేరింది. టీడీపీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గౌరు ఫ్యామిలీ… కొంతకాలం నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా గౌరు వెంకట్ రెడ్డి, ఆయన భార్య చరిత మళ్లీ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏప్పుడు వైసీపీలో చేరుతారో
